Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రెడీ.. ఆందోళన అవసరం లేదు: మోదీ

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (08:04 IST)
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారైంది. అమెరికాకు చెందిన మోడెర్నా బయోటెక్‌ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ఇన్‌ఫెక్షన్స్‌కు ఎంఆర్‌ఎన్‌ఎ-1273 పేరిట తయారైన ఈ వ్యాక్సిన్‌ను ఆ సంస్థ అందజేసింది.

ఏప్రిల్‌ నెలలో మనుష్యులపై ప్రయోగాలు చేస్తామని సంస్థ ప్రకటించింది. అన్ని అనుమతులు సాధించేందుకు ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.
 
కరోనాపై ఆందోళన అవసరం లేదు: ప్రధాని మోదీ
కరోనావైరస్ (కోవిడ్-19)పై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దీని వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమతుండడంతో ప్రధాని మోదీ స్పందించారు.

‘‘ఎలాంటి భయాందోళన అవసరం లేదు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. స్వీయ రక్షణపై కొంచెం శ్రద్ధ వహించడం ముఖ్యం. అందరూ కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి...’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఓ గ్రాఫిక్‌ను కూడా ప్రధాని షేర్ చేసుకున్నారు.

దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై ప్రధాని ఢిల్లీలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన స్పందిస్తూ.. ‘‘కోవిడ్-19 నోవెల్ కరోనా వైరస్‌పై సిద్ధపాటు గురించి సమీక్షా సమావేశం జరిగింది.

విదేశాల నుంచి వచ్చిన వారిని స్క్రీనింగ్ నిర్వహించడం మొదలు బాధితులకు  అందించాల్సిన చికిత్స వరకు అన్ని అంశాలపైనా పలు మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి...’’ అని ప్రధాని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments