Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రో కొత్త చైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (13:45 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ నియమితులయ్యారు. సంస్థకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న ఎస్.సోమనాథ్ నుంచి ఆయన ఈ నెల 14వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది. 
 
ప్రస్తుతం ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ)కు నేతృత్వం వహిస్తున్నారు. సంస్థలో నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేశారు. రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ చోదక వ్యవస్థల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ద్రవ, సెమీ క్రయోజెనిక్, క్రయోజెనిక్ చోదక వ్యవస్థల అభివృద్ధిలో ఆయన పాలుపంచుకున్నారు. 
 
ఇస్రోకు చెందిన జీఎస్ఎల్వీ మార్క్-2, 3 వాహకనౌకల రూపకల్పనలో కీలకభూమిక వహించారు. ఆదిత్య-ఎల్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3లోని చోదక వ్యవస్థల అభివృద్ధికి ఆయన కృషిచేశారు. నారాయణన్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. ఐఐటీ ఖరాగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజినీరింగులో మొదటి ర్యాంకుతో ఎంటెక్ పూర్తిచేశారు. 2001లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

విశాల్ ఆరోగ్యానికి ఏమైందంటే? ఖుష్బూ వివరణ

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments