శశికళ గొంతెమ్మ కోర్కెలు... ప్రత్యేక గది.. టీవీ.. డబుల్‌కాట్ బెడ్.. ఇంటి భోజనం.. ఇంకా
జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ప్రస్తుత బెంగుళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారవాసం అనుభవిస్తున్నారు. ఈమెకు ఇక్కడ ఓ సాధారణ ఖైదీలా
జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ప్రస్తుత బెంగుళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారవాసం అనుభవిస్తున్నారు. ఈమెకు ఇక్కడ ఓ సాధారణ ఖైదీలా చూస్తున్నారు. సాధారణ ఖైదీలకు కేటాయించే గదినే కేటాయించారు. కటిక నేలపైనే నిద్రిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తనకు సకల సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆమె గొంతెమ్మ కోరికల చిట్టాను చూసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఖంగుతిన్నారు. పైగా, ఆ సకల సౌకర్యాలను కల్పించేందుకు నిరాకరించిన న్యాయస్థానం కేవలం వాటిల్లో రెండు కోరికలు తీర్చేందుకు అంగీకరించింది.
వాటి వివరాల్లోకి వెళ్తే... శశికళ తనకు ప్రత్యేకంగా గది కేటాయించాలని, అందులో ప్రత్యేకమైన టీవీ, డబుల్ కాట్ బెడ్, వెస్ట్రన్ కమోడ్, ఇంటి భోజనం, తన బాగోగులు చూసుకునేందుకు జైల్లో పనిమనిషి, తమిళనాడు వార్తా పత్రికలు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ చిట్టాను చూడగానే న్యాయమూర్తి మండిపడ్డారు
సాధారణ జైలు జీవితం అంటే తెలుసా? అని ప్రశ్నించారు. ఆమెకు ఎలాంటి అదనపు సౌకర్యాలు కల్పించవద్దని జైలర్‌ను పిలిచి మరీ ఆదేశించారు. అయితే తనకు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కావాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేయడంతో దానిని పరిశీలించి, విచారించిన న్యాయమూర్తి...ప్రాణహాని ఉందని ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఒక గది కేటాయించాలని అధికారులను సూచించారు.
అలాగే షుగర్ పేషంట్ కావడంతో ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించలేమని, అయితే ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటే తీసుకోవచ్చని తెలిపారు. దీంతో ఆమె రూం, భోజనం కోరికలు నెరవేరాయి. దీంతో ఆమె కొంతమేరకు ఉపశమనం పొందారు.