Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత అప్పుడే చులకన అయిపోయారా? అమ్మ కంటే పైన చిన్నమ్మ బ్యానర్...

దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న జయలలితను అప్పుడే శశికళ గ్యాంగ్ చులకన చేసేసింది. అన్నాడీఎ

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (13:59 IST)
దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న జయలలితను అప్పుడే శశికళ గ్యాంగ్ చులకన చేసేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత ఆకస్మికంగా మృతితో చిన్నమ్మ శశికళకు గురువారం పార్టీ పగ్గాలు అప్పగించాయి.
 
 గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు పలువురు మంత్రులు పోయెస్ గార్డెన్ చేరుకుని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే చిన్నమ్మ శశికళ దగ్గరకు వెళ్లిన పార్టీ నాయకులను చూసిన కార్యకర్తలు షాకైయ్యారు. జయలలిత ఉన్న సమయంలో ఆమె దగ్గరకు వెళ్లి పలకరించాలన్నా, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకోవాలన్నా నాయకులు వారి షర్టు జేబులో కచ్చితంగా అమ్మ జయలలిత ఫోటో పెట్టుకునేవారు. అది పార్టీ సాంప్రధాయంగా వచ్చేసింది.
 
గురువారం అన్నాడీఎంకే చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తరువాత శశికళ దగ్గరకు వెళ్లిన నాయకుల జేబులో అమ్మ జయలలిత ఫోటో మాయమైపోయింది. చిన్నమ్మ ఫోటో వచ్చేసింది. అదేంటంటే? పార్టీ చీఫ్ ప్రస్తుతం చిన్నమ్మే కదా అంటూ చెప్తున్నారు. అంతేగాకుండా.. అమ్మ బ్యానర్లు చాలామటుకు కనుమరుగైనాయి.  చెన్నైలో కొన్ని చోట్ల అమ్మ ఫోటో కింద.. చిన్నమ్మ ఫోటో పైన గల బ్యాన్సర్లు వెలిశాయి. అయితే అమ్మను అప్పుడే చులకన చేసేసిన వైనం అన్నాడీఎంకే కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments