Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓం' అని ఉచ్ఛరించినా వివాదమవుతోంది : నరేంద్ర మోడీ ఆవేదన

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:58 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో 'ఓం' అని మాట్లాడినా వివాదాస్పదమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తంచేశారు. ఆకాశవాణి రూపొందించిన ‘రామ్‌చరిత్‌ మానస్‌’ డిజిటల్‌ ప్రతుల(సీడీ)ను సోమవారం ఆయన ఢిల్లీలో ఆవిష్కరించారు.
 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ‘ఓం’ అని ఉచ్ఛరించినా వివాదంగా మారుతోందన్నారు. దేశంలో ప్రతిదానికీ సిద్ధాంతరాద్ధాంతాలు రేగుతున్న నేటి వాతావరణంలో ఓంకారం కూడా రచ్చలు - రావిళ్లకు దారితీసే వివాదం అవుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. 
 
‘రామ్‌చరిత్‌ మానస్‌’ భారతీయ ధర్మాన్ని ప్రతిబింబించే ఒక గొప్ప ఇతిహాసమని కొనియాడారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఆకాశవాణిపైనా మోడీ ప్రశంసల వర్షంకురిపించారు. ఆ సంస్థ వద్ద పలువురు ప్రముఖ కళాకారులకు చెందిన 9 లక్షల గంటల ఆడియో రికార్డింగ్‌లు ఉన్నాయని.. అది అమూల్యమైన కలెక్షన్‌ అని, వాటిని శాశ్వతంగా భద్రపరచాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments