Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. అపార నష్టం.. ఆరుగురి మృతి

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (08:49 IST)
హిమాలయపర్వత శ్రేణుల్లో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అపారనష్టం వాటిల్లుతుంది. ఈ వర్షల కారణంగా ఏర్పడిన వరదల వల్ల ఆరుగురు మృత్యువాతపడ్డారు. 
 
కాగా, ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దీంతో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ప‌లు చోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. 
 
ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌ల్లో ముగ్గురు నేపాలి వాసులు, కాన్పూర్‌కు చెందిన ప‌ర్యాట‌కుడితో మ‌రో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఒక చిన్నారి ఉన్నారు. భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా రోడ్లు దెబ్బ‌తిన‌డంతో.. నైనిటాల్‌కు రాక‌పోక‌లు ఆగిపోయాయి.
 
కేద‌ర్‌నాథ్ టెంపుల్‌కు వెళ్లి వ‌ర‌ద‌లో చిక్కుకున్న 22 మంది భ‌క్తుల‌ను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు క‌లిసి కాపాడారు. 55 ఏండ్ల వ‌య‌సున్న ఓ వ్య‌క్తి న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో ఉండ‌టంతో అత‌న్ని స్ట్రెచ‌ర్‌పై మోసుకెళ్లారు. 
 
నందాకిని రివ‌ర్ ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌టంతో.. అక్క‌డ పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. బ‌ద్రీనాథ్ నేష‌న‌ల్ హైవేకు స‌మీపంలోని లాంబ‌గ‌డ్ న‌ల్లాహ్ వ‌ద్ద వ‌ర‌ద‌లో చిక్కుకున్న కారును క్రేన్ స‌హాయంతో బ‌య‌ట‌కు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments