ధౌలిగంగ నదిలో పెరిగిన నీటిమట్టం.. విరాళంగా మ్యాచ్ ఫీజు

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (10:35 IST)
Uttarkhand
ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగ నదిలో ఆ రాత్రి మరోసారి నీటిమట్టం పెరిగింది. చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం నందా దేవి హిమానీనదం విరిగిపడింది. దీంతో ధౌలిగంగ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. కాగా, ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నీటి ఉధృతి మళ్లీ పెరిగింది. దీంతో చమోలీ ప్రాంతంలో పోలీసుల ప్రజలను అప్రమత్తం చేశారు. 
 
తపోవన్‌-విష్ణుగఢ్‌ హైడర్‌ ప్రాజెక్టు టన్నల్‌లో 35 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆధునిక యంత్రాలతో టన్నల్‌ వద్ద శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే నిన్న రాత్రి అనూహ్యంగా నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
 
ఇండియన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. ఉత్తరాఖాండ్ ఘటన బాధితులకు తన వంతు సహాయంగా మ్యాచ్ ఫీజును విరాళమిచ్చాడు. చెన్నై వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో పంత్ ఆడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఈ ఘటనపై పంత్ ఫీలింగ్‌ను ట్వీట్ రూపంలో వెల్లడించాడు.
 
ఉత్తరాఖాండ్ ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి గురించి చాలా ఫీలయ్యా. వీలైనంత మందికి సహాయపడదామనే ఉద్దేశ్యమంతో నా మ్యాచ్ ఫీజు విరాళమివ్వాలనుకుంటున్నా’ అని పంత్ ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments