Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో ఎంత ధైర్యం : ఆ మహిళ.. చిరుత పులినే కొడవలితో..?

Webdunia
మంగళవారం, 26 ఆగస్టు 2014 (12:40 IST)
అమ్మో ఆ మహిళకు ఎంత ధైర్యం చిరుత పులిని కొడవలితో నరికేసిందట. సాధారణంగా చిరుతపులి ఎదురుపడితే ఎవరికైనా చలి చెమటలు పట్టాల్సిందే. దాన్ని చూడటంతోనే తమ ప్రాణాలు కోల్పోయామని చేతులెత్తేస్తాం. 
 
అయితే అలాంటి చిరుతపులితో ఓ 56ఏళ్ల పెద్దావిడ వీరోచితంగా పోరాడి దాన్ని చంపేసి తన ప్రాణాలను రక్షించుకుంది. ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లా కోడి బోడ్నా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం కమలాదేవి(56) గొడ్డలి, కొడవలితో పొలం పనుల నిమిత్తం వెళ్లింది. పొలంలో తన పనిలో తలమునకలైన ఆమె పైకి అక్కడి చేరుకున్న చిరుత పులి ఒక్కసారిగా దాడి చేసింది. 
 
పొలం పని కోసం వెంట తెచ్చుకున్న పని ముట్లే ఆమెకు ఆయుధాలయ్యాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు క్షణాల్లోనే గొడ్డలి, కొడవలితో కమలాదేవి చిరుతపైకి ఎదురుదాడికి దిగింది. తన వద్ద ఉన్న గొడ్డలి, కొడవలి సాయంతో పులితో సుమారు 30 నిమిషాలపాటు పోరాడిన కమలాదేవి, చివరకు దాన్ని హతమార్చింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె శ్రీనగర్ (గర్వాల్) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments