Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌‍లో విద్యుత్ షాక్‌కు 15 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 19 జులై 2023 (19:56 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కరెంట్ షాక్ తగిలి 15 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. మృత్తుల్లో ముగ్గురు పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు హోం గార్డులు కూడా ఉన్నారు. చమోలీ జిల్లా అలకనందా నది ఒడ్డున నమామి గంగే ప్రాజెక్టు స్థలం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఓ పంపింగ్ స్టేషన్‌ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో పక్కనే ఉన్న ఇనుప రైలింగ్‌కు విద్యుత్ సరఫరా అయింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ అదనపు డీజీపీ వి.మురుగేశన్ మాట్లాడుతూ, మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ప్రమాదవశాస్తు మరణించాడు. దీంతో బుధవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. వైద్యుల సాయంతో అక్కడే పంచనామా చేపట్టారు. ఆ సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. దీంతో ఇనుప రెయిలింగ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఇలా జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని, దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments