ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకేకాదు.. మైనర్ బాలికలకు కూడా ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా పేదరికం వారిపాలిట శాపంగా మారింది. ఫలితంగా.. తమపై అత్యాచారాలు చేసిన కామాంధులనే తిరిగి తన భర్తలుగా పొందా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకేకాదు.. మైనర్ బాలికలకు కూడా ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా పేదరికం వారిపాలిట శాపంగా మారింది. ఫలితంగా.. తమపై అత్యాచారాలు చేసిన కామాంధులనే తిరిగి తన భర్తలుగా పొందాల్సిన నిర్బంధ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా అత్యాచారానికి గురైన 14 యేళ్ల మైనర్ బాలిక పేదరికం శాపం కారణంగా రేపిస్టునే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
బరేలీకి చెందిన 14 ఏళ్ల బాలికపై ఆసిఫ్ అనే యువకుడు గతంలో అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కోర్టు విచారణలో ఉంది. ఈలోగా అత్యాచార బాధిత బాలిక గర్భవతి అయి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బాధిత బాలిక తండ్రి నిరుపేద కావడంతో పాటు కూతురు ప్రసవానికి బాలిక తండ్రి 20 వేల రూపాయలు రుణం తీసుకోవాల్సి వచ్చింది.
దీంతో పాటు కూతురితోపాటు బాబు ఆలనపాలన భారంగా మారింది. దీనికితోడు మరోవైపు కేసులో భాగంగా కోర్టుకు వెళ్లాలంటే యాభైకిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. దీంతో పెద్దలు జోక్యం చేసుకొని బాధిత బాలికను పెళ్లి చేసుకోవాలని అత్యాచారం చేసిన నిందితుడినే కోరారు. ఫలితంగా ఆ తండ్రి రేపిస్టుకి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు.