Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చావుకు నా భార్య - ఆమె ప్రియుడే కారణం...

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (15:08 IST)
కట్టుకున్న భార్య, ఆమె ప్రియుడు వేధింపులను భరించలేని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య మ‌రొక‌రితో సంబంధం పెట్టుకోవ‌డం జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోమతి నగర్‌లో జరిగింది. 
 
ఆల‌స్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోమ‌తి న‌గ‌ర్‌కు చెందిన నిఖిల్‌కు 2012లో వివాహం కాగా, ఒక కుమార్తె ఉంది. నిఖిల్ కిరాణా దుకాణం నిర్వ‌హిస్తుండ‌గా, భార్య ఓ ఎన్జీవో సంస్థ‌లో ప‌ని చేస్తోంది.
 
అయితే భార్య త‌న స‌హోద్యోగితో గ‌త కొంత‌కాలం నుంచి వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తోంది. అదేసమయంలో ఆమె కుటుంబాన్ని ప‌ట్టించుకోవ‌డం మానేసింది. స‌హోద్యోగితో స‌న్నిహితంగా ఉండ‌టం మానుకోవాల‌ని భార్య‌ను నిఖిల్ హెచ్చ‌రించాడు. 
 
అయిన‌ప్ప‌టికీ ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు. మంగ‌ళ‌వారం రాత్రి భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. త‌న అక్ర‌మ సంబంధానికి అడ్డు రావొద్ద‌ని భార్య భ‌ర్త నిఖిల్‌కు తెగేసి చెప్పింది. లేదంటే అంతు చూస్తాన‌ని బెదిరించింది.
 
దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన నిఖిల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఘ‌ట‌నాస్థ‌లిలో నాలుగు పేజీల లేఖ ల‌భ్య‌మైంది. త‌న చావుకు భార్య‌, ఆమె ప్రియుడే కార‌ణ‌మ‌ని, వారిద్ద‌రిని క‌ఠినంగా శిక్షించాల‌ని నిఖిల్ త‌న సూసైడ్ నోట్‌లో పేర్కొన్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments