Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిమండపం రక్తసిక్తం : తుపాకీ కాల్పుల్లో వరుడు మృతి

పెళ్లి మండపం రక్తసిక్తమైంది. వరుడుని లక్ష్యంగా చేసుకుని ఓ యువకుడు తుపాకీ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీమ్‌పూర్ ఖైరీ జిల్లాలోని రామ్‌పూ

Webdunia
బుధవారం, 2 మే 2018 (08:53 IST)
పెళ్లి మండపం రక్తసిక్తమైంది. వరుడుని లక్ష్యంగా చేసుకుని ఓ యువకుడు తుపాకీ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీమ్‌పూర్ ఖైరీ జిల్లాలోని రామ్‌పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రామ్‌పూర్‌ మరికొన్ని క్షణాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం వరుడు పెళ్లి పీటలపై కూర్చొనివున్నాడు. మరోవైపు పెళ్లిమండటం మొత్తం మేళతాళాలతో మోర్మోగుతోంది. ఇంకోవైపు, డీజే శబ్దంతో దద్ధరిల్లిపోతోంది. ఇంతలో ఓ యువకుడు తన జేబులోనుంచి తుపాకీ తీసి వరుడుని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఇందులో ఓ బుల్లెట్ నేరుగా వరుడు ఛాతిలోకి దూసుకెళ్ళడంతో పెళ్లిపీటలపైనే వరుడు ప్రాణాలు వదిలేశాడు. దీంతో పెళ్లిమండపంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. పెళ్లి కుమారుడి పేరు సునీల్‌ వర్మ (25) అని, వివాహం సందర్భంగా పెద్ద శబ్దంతో మ్యూజిక్‌ పెట్టడంతో తుపాకీ పేలిన శబ్దం కూడా ఎవరికీ వినబడలేదని చెప్పారు. వరుడు కుప్పకూలిపోగా ఆయనను ఆసుపత్రికి తరలించారని అన్నారు. అయితే, అప్పటికే వరుడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని తెలిపారు. తుపాకీ పేల్చిన యువకుడు పరారీలో ఉన్నాడని, నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments