అయోధ్యలో మద్యం - మాంసం విక్రయాలు నిషేధం

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (08:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు పేర్లను మార్చిన యూపీ సర్కారు ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఫైజాబాద్ జిల్లా పేరును శ్రీ అయోధ్యగా మార్చిన విషయం తెల్సిందే. 
 
దీంతో త్వరలో అయోధ్య జిల్లాలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించనున్నట్లు యూపీ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ వెల్లడించారు. ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన యూపీ సర్కారు చట్టపరంగా మద్యం, మాంసం విక్రయాలను నిషేధించనున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
జిల్లా పేరును అయోధ్యగా మార్చిన తర్వాత సాధువులు మద్యం, మాంసాన్ని నిషేధించాలని కోరుతున్నారని, అందుకే సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వివరించి నిషేధం విధిస్తామని ఆయన చెప్పారు. అయోధ్య మున్సిపల్ బోర్డు ఏరియాతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments