Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ మొరదాబాద్‌లో అగ్నిప్రమాదం - నలుగురి సజీవదహనం

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:34 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్‌లోని గల్‌షహీద్ ప్రాంతంలోని ఓ మూడు అంతస్తుల భవనంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 
 
ఈ భవనం యజమాని ఇంటిలోని మూడో అంతస్తులో నివసిస్తున్నాడు. కింది ఇంటిలో స్క్రాప్ మెటీరియల్ ఉంది. వీటికి నిప్పు అంటుకుని పై అంతస్తుకు కూడా పాకాయి. దీంతో మూడో అంతస్తులోని వారు కిందికి రాలేకపోయారు. పైగా, వారిని రక్షించేందుకు అగ్నిమాపకదళ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. 
 
ఈ ప్రమాదంపై మొరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు శైలేంద్ర సింగ్, సీనియర్ పోలీస్ అధికారి హేమంత్ కుటియాల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదం వెనుకగల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఈ భవనంలో ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. దీంతో అనేక మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం 12 మందిని రక్షించారు. వారిలో ఐదుగురుతీవ్రంగా గాయపడి నలుగురు అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments