Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాల పర్వం : 5 నెలల్లో 1012 రేప్ కేసులు నమోదు

దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు, మహిళలపై వేధింపులు, దోపిడీలు, దొంగతనాలపర్వం కొనసాగుతోంది. దీనికి నిదర్శనం గత ఐదు నెలల్లో ఐదు నెలల్లో 1012 కేసులు నమోదయ్య

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (10:48 IST)
దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు, మహిళలపై వేధింపులు, దోపిడీలు, దొంగతనాలపర్వం కొనసాగుతోంది. దీనికి నిదర్శనం గత ఐదు నెలల్లో ఐదు నెలల్లో 1012 కేసులు నమోదయ్యాయి. తాజాగా వెల్లడైన ఈ గణాంకాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమ్మాయిలపై అత్యాచారాల సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తాజాగా వెలువడిన ఆ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అమ్మాయిలపై అత్యాచారాల ఘటనలేకాకుండా మహిళలపై వేధింపుల ఘటనలూ సైతం ఎక్కువేనని తేలింది. 
 
దేశం మొత్తంమీద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళలపై సాగుతున్న ఘటనలు పెరుగుతుండటం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు 1,012 రేప్ కేసులు, 4,520 మహిళలపై వేధింపుల కేసులు, 1386 దొంగతనాలు, 86 దోపిడీ కేసులు నమోదయ్యాయని యూపీ బీజేపీ ఎమ్మెల్యే సతీష్ మహానా అడిగిన ప్రశ్నకు యూపీ సర్కారు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. 
 
మహిళలపై సాగుతున్న నేరాలపై వెబ్ ఆధారిత నేరాల హాట్‌స్పాట్లను గుర్తించి పోలీసు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశామని సర్కారు ఎమ్మెల్యేకు రాసిన సమాధానంలో పేర్కొంది. మహిళలపై సాగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా స్థాయిలో నేర విభాగాలను ఏర్పాటు చేశామని సర్కారు వివరించింది. 

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments