Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ఛాటింగ్.. భర్త కనిపెట్టేశాడని.. కొడవలితో దాడి చేసి.. జంప్ అయ్యింది..

వావి వరుసలు మంట కలిసిపోతున్నాయి. మానవీయ విలువలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ప్రియుడితో తనకున్న సంబంధాలను కనిపెట్టేసిన భార్య భర్తపైనే దాడికి ఒడిగట్టింది. అంతటితో ఆగకుండా.. ప్రియుడితో జక్కేసింది. ఈ ఘట

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (10:00 IST)
వావి వరుసలు మంట కలిసిపోతున్నాయి. మానవీయ విలువలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ప్రియుడితో తనకున్న సంబంధాలను కనిపెట్టేసిన భార్య భర్తపైనే దాడికి ఒడిగట్టింది. అంతటితో ఆగకుండా.. ప్రియుడితో జక్కేసింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఖేరాఘర్‌లోని భిలావలి గ్రామానికి చెందిన నేత్రాపాల్‌కు 2014లో నీతూసింగ్ అనే మహిళతో వివాహం జరిగింది. 
 
వివాహం జరిగిన కొన్ని రోజులకే తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం వుందని, అతడినే ప్రేమిస్తోందని నేత్రాపాల్‌కు తెలిసింది. దీంతో వారిద్దరూ విడిపోయి దూరంగా ఉంటున్నారు. ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు నీతూసింగ్‌ తన భర్త ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో వాట్సాప్‌లో నీతూ ప్రియుడితో ఛాట్ చేస్తుండగా నేత్రాపాల్ చూశాడు. దీంతో ఆమెను ఫోన్ ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది.
 
దీంతో ఆమె నుంచి బలవంతంగా ఫోనును లాగేసుకుని ప్రియుడితో ఆమె సంభాషణ మొత్తం చూసేశాడు. ఫోన్ లాక్కుని ఛాట్ సంభాషణ చూసేయడంతో ఆగ్రహానికి గురైన నీతూ ఇంట్లోని కొడవలితో అతని తలపై బలంగా కొట్టింది. వెంటనే అతను గట్టిగా అరుస్తూ ఇంట్లో కుప్పకూలిపోయాడు. దీంతో బంధువులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ హడావుడిలో నీతూ తప్పించుకుని, ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటనలో గాయపడిన నేత్రాపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments