Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 14 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (10:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాతపడ్డారు. ప్రయాగ్‌రాజ్ - లక్నో జాతీయ రహదారిపై గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఆరుగురు చిన్నారులున్నారు. 
 
కుండా నుంచి ప్రయాగ్‌రాజ్‌వైపు ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రయాగ్‌రాజ్ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నప్పటికీ అప్పటికే వాహనంలోని అందరూ మృతి చెందారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలను వెలికి తీయడం వారికి సాధ్యపడలేదు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నుజ్జుగా మారిన బొలెరో వాహనంలో మృతదేహాలు చిక్కుకుపోవడంతో దానిని ఎక్కడికక్కడ కట్‌చేసి వాటిని వెలికి తీశారు. 
 
బాధితులు నబాబ్ గంజ్ ప్రాంతంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘోర దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments