Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా మహిళపై సాధువు లైంగిక దాడి..!

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (12:56 IST)
సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దేశంలోని మహిళలనే కాకుండా విదేశాల నుంచి వచ్చే మహిళలను కూడా మృగాళ్లు వదలడం లేదు. తాజాగా సాధువు అవతారం ఎత్తిన మృగాడు ఓ విదేశీ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
హోళీ ఉత్సవాల కోసం ఉత్తరప్రదేశ్లోని వృందావన్‌కు వచ్చిన ఓ 40 ఏళ్ల అమెరికన్ మహిళపై ఓ సాధువు అత్యాచారం జరిపాడు. ఆమెను తీవ్రంగా కొట్టి మరి లైంగికదాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. కృష్ణుడి భక్తురాలైన కాలిఫోర్నియాకు చెందిన ఆమె గత ఫిబ్రవరి 26న హోళీ ఉత్సవాల కోసం వృందావన్‌కు వచ్చి ఓ గెస్ట్ హౌస్లో దిగింది.
 
తర్వాత రోజు నుంచి కనిపించకుండా పోయింది. అనంతరం తీవ్రగాయాలై స్పృహకోల్పోయిన ఆమెను పోలీసులు గుర్తించారు. చికిత్స అనంతరం మెలకువలోకొచ్చిన ఆమె తులసీమాల ధరించిన ఓ సాధువు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమె తెలిపిన వివరాల మేరకు సాధువు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?