Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాపై అమెరికా ప్రతీకార చర్యలు!

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:31 IST)
అమెరికా దేశ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ, యూఎస్ లో సేవలందిస్తున్న చైనా టెలికం సంస్థపై నిషేధానికి రెడీ అయింది.

'చైనా టెలికం'పై ఆంక్షలు విధించాలని, దానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎఫ్సీసీ (ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్)కు యూఎస్ డిఫెన్స్, హోమ్, వాణిజ్య శాఖలు ఒకేసారి సిఫార్సు చేశాయి. 
 
న్యాయ శాఖ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ, "చైనా టెలికం కంపెనీతో అమెరికాకు నష్టం కలుగుతుందని గుర్తించాం. ఆ సంస్థ లైసెన్స్ లను రద్దు చేయాలి" అని కోరింది. ఇక ఈ మేరకు అమెరికా నిర్ణయం తీసుకుంటే, లక్షల మందికి మొబైల్, ఇంటర్నెట్ సేవలు దూరమవుతాయి. 
 
కాగా, గతంలోనూ చైనా టెలికం సంస్థపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ సైబర్ నిఘాను పెట్టిందని, ఆర్థిక గూడచర్యానికి పాల్పడుతూ, దేశాభివృద్ధికి అంతరాయం కలిగిస్తోందని పలు మంత్రిత్వ శాఖలు ఆరోపిస్తున్నాయి.

చైనా టెలికం సంస్థ, యూఎస్ కమ్యూనికేషన్స్ సిస్టమ్ ను దారి మళ్లిస్తోందని పలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మండిపడుతున్నాయి. ఇక, ఈ విషయంలో శ్వేతసౌధం నేడో, రేపో కల్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments