Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై యుఎస్ కాన్సులేట్‌లో వీసాల జారీ నిలిపివేత.. అమెరికా పౌరులకు హెచ్చరిక

చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అదేసమయంలో తమిళనాడులో ఉండే అమెరికా పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీచేసింది.

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (16:55 IST)
చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అదేసమయంలో తమిళనాడులో ఉండే అమెరికా పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీచేసింది. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం బాగా విషమించిందని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన విషయం తెల్సిందే. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా కాన్సులేట్ తమ పౌరులకు అత్యవసర సందేశాన్ని జారీచేసింది. 
 
స్థానికంగా నెలకొన్న ఈ పరిస్థితుల్లో అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత భద్రతా ప్లాన్స్‌ను ఎప్పడికప్పుడూ సమీక్షించుకుంటూ ఉండాలని ఆదేశించింది. అమ్మ ఆరోగ్య పరిస్థితుల్లో చెలరేగే ఆందోళనల ప్రాంతాలకు దూరంగా ఉండాలని అమెరికన్లకు సూచించింది. అమెరికన్ సిటిజన్లకు, వీసా దరఖాస్తుదారులకు అందించే సాధారణ సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు కూడా ప్రకటించింది.
 
అమ్మ జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో గోపాలపురం ప్రాంతం జెమినీ సర్కిల్లో యూఎస్ కాన్సులేట్ జనరల్ ఉంది. దీంతో తమ సేవలను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments