Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే బిడ్డే ముద్దు.. రెండో బిడ్డ వద్దు.. ఇదీ నగరంలోని మహిళల తీరు.. అసోచామ్

పిల్లల పెంపకం పట్ల నగరంలో జీవించే మహిళలు విముఖత చూపిస్తున్నారట. నగర భారతంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో 35 శాతం మంది మహిళలు.. పిల్లలను పెంచేందుకు.. వారితో వెచ్చించే సమయం, ఓపిక లేకపోవడంతో ఒకే సంతానంతో

Webdunia
శనివారం, 13 మే 2017 (14:50 IST)
పిల్లల పెంపకం పట్ల నగరంలో జీవించే మహిళలు విముఖత చూపిస్తున్నారట. నగర భారతంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో 35 శాతం మంది మహిళలు.. పిల్లలను పెంచేందుకు.. వారితో వెచ్చించే సమయం, ఓపిక లేకపోవడంతో ఒకే సంతానంతో సరిపెట్టుకుంటున్నారని అసోచామ్ సర్వేలో తేలింది. అసోచామ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 500 మంది ఉద్యోగినులు రెండవ సంతానాన్ని కోరుకోవడం లేదని తెలియవచ్చింది. 
 
ఒక మెటర్నిటీ లీవ్ ఓకే కానీ రెండో మెటర్నిటీ లీవులు తీసుకుని తమ ఉద్యోగాన్ని, పదోన్నతిని పణంగా పెట్టలేమని ఉద్యోగినులు వాపోతున్నారు. ఉద్యోగం ఆవశ్యం కావడంతో పిల్లల పెంపకం ఆసక్తి చూపలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు చెప్తున్నారు. ఈ సర్వేను అహ్మదాబాద్‌, బెంగుళూర్‌, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, ఇండోర్‌, జైపూర్‌, కోల్‌కతా, లక్నో, ముంబయి వంటి పది నగరాల్లో నిర్వహించారు. 
 
ఉద్యోగంలో ఒత్తిడి, ఇంట్లో పని కారణాలతో చాలామంది తల్లులు ఒకే సంతానంతో సరిపెట్టుకోవాలని భావిస్తున్నారని సర్వే తేల్చింది. ఒకే సంతానం కలిగిన 1500 మంది పనిచేసే తల్లులను అసోచామ్‌ సర్వే పలుకరించింది. ఉద్యోగం, ఇల్లును సమన్వయం చేసుకుంటూ వస్తున్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో రెండో సంతానంపై దృష్టి పెట్టట్లేదని సర్వేలో తేలింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments