Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవర్ డ్యూటీతో అలసిన డ్రైవర్... 17 గంటల పాటు గూడ్సు రైలును నిలిపేశాడు...

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (17:22 IST)
భారతీయ రైల్వేలో డ్రైవర్లు, గార్డులుగా పని చేసే వారు ఓవర్ టైమ్ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల ఇదేవిధంగా కొనసాగితే అనేక ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితికి ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఓ సంఘటనే మచ్చుతునక. వరుసగా ఓవర్‌టైమ్‌ డ్యూటీలు చేసి అలసిపోయిన ఓ గూడ్సు రైలు డ్రైవరు చివరకు ఒకరోజు తాను నడపాల్సిన గూడ్సు రైలును స్టేషన్‌లో 17 గంటలపాటు నిలిపేశాడు.
 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహీ ప్రాంతానికి చెందిన ఓ రైలు డ్రైవర్‌ తాను నడుపుతున్న గూడ్స్‌ రైలుని స్థానిక మోధ్‌ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశాడు. ఆ తర్వాత రైలు ఇంజిన్‌లోనే పనుకుని నిద్రపోయాడు. అలా ఏకంగా 17 గంటల పాటు నిలిపేశాడు. 
 
కొన్ని గంటలపాటు పట్టాలపై రైలు నిలిచిపోవడంతో స్టేషన్ మాస్టర్ అప్రమత్తమై పరిశీలించగా ఇంజన్‌లో డ్రైవర్ నిద్రపోవడాన్ని గమనించాడు. ఎంత సర్ధి చెప్పినా అతను మాత్రం అదేవిధంగా నిద్రపోయాడు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments