Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో కరోనా విలయ తాండవం.. 577మంది టీచర్ల మృతి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (16:33 IST)
ఉత్తరప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. యూపీ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 577 మంది టీచర్లు కరోనా బారిన పడి చనిపోయారు. ఈ మేరకు యూపీ ఎన్నికల సంఘానికి టీచర్స్ యూనియన్ ప్రతినిధులు.. టీచర్ల మరణాలపై నివేదిక సమర్పించారు. మే 2న జరగాల్సిన కౌంటింగ్‌ను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని టీచర్లు కోరారు.
 
ఈ సందర్భంగా యూపీ శిక్షక్ మహాసంఘ్ ప్రెసిడెంట్ దినేష్ చంద్ర శర్మ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో కొంత మందికి కరోనా సోకింది. 71 జిల్లాల నుంచి 577 మంది టీచర్లు కరోనా సోకి మరణించారు అని తెలిపారు. 
 
టీచర్ల మరణాలపై వివరణ ఇవ్వాలని అలహాబాద్ కోర్టు మంగళవారం యూపీ ఎన్నికల సంఘాన్నిఆదేశించింది. ఈ క్రమంలో స్పెషల్ వర్క్ ఆఫీసర్ ఎస్‌కే సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులకు టీచర్ల మరణాలపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments