Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధువుతో ప్రేమ.. ఇంటి నుంచి జంప్.. చెల్లెల్ని కాల్చి చంపేసిన అన్న!

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (18:20 IST)
తన చెల్లెలు ప్రేమించినవాడితో వెళ్లిపోయిందనే ఆగ్రహంతో చెల్లెలిని ఓ అన్నయ్య కాల్చి చంపేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాగా చెల్లెలు ప్రేమించిన యువకుడు దగ్గర బంధువే అయినా ఆ అన్నయ్య పరువు హత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా చుర్ గ్రామంలో 16 ఏళ్ల అంజలి అనే అమ్మాయి గౌరవ్ అనే యువకుడిని ప్రేమించింది. దానికి అంజలి ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. 
 
దీంతో గౌరవ్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది.దీంతో అంజలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించగా ప్రియుడితో కలిసి జూన్ 13న కనిపించింది. వెంటనే బలవంతంగా అంజలిని ఇంటికి తీసుకొచ్చేశారు.
 
కానీ తండ్రీ అన్న ఏం చేస్తారోనని అంజలి భయపడుతూనే ఉంది. ఈ క్రమంలో గత శనివారం (జూన్ 20, 2021) ఇంట్లో పనిచేసుకుంటున్న అంజలిని అన్న శేఖర్ 'ఇంట్లోంచి పారిపోయి మా పరువు తీస్తావా? అంటూ నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక మామ అమర్‌పాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments