Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల చదువుల కోసం కిడ్నీని అమ్మేసింది.. సిలిండర్ అమ్మి యోగిని కలిసినా?

అమ్మతానికి ఆమే ఆదర్శంగా నిలిచింది. పిల్లల చదువుల కోసం ఓ తల్లి తన కిడ్నీని అమ్మకానికి పెట్టింది. యూపీలోని ఆగ్రా, రోహత ప్రాంతానికి చెందిన ఆర్తి శర్మ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో తన కిడ్నీని అమ్మకానికి ప

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (10:35 IST)
అమ్మతానికి ఆమే ఆదర్శంగా నిలిచింది. పిల్లల చదువుల కోసం ఓ తల్లి తన కిడ్నీని అమ్మకానికి పెట్టింది. యూపీలోని ఆగ్రా, రోహత ప్రాంతానికి చెందిన ఆర్తి శర్మ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో తన కిడ్నీని అమ్మకానికి పెడుతూ తన ముగ్గురు కుమార్తెలు, కొడుకు చదువు కోసం ఈ పనిచేయక తప్పట్లేదని వాపోయింది. గార్మెంట్ షాపు నష్టాల్లో కూరుకుపోవడంతో.. పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేక ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆ తల్లి వెల్లడించింది. 
 
ఏప్రిల్ 29న ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌ను బ్లాక్ మార్కెట్లో అమ్మేసి ఆ డబ్బులతో లక్నో వెళ్లి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని కలిసి గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి సహాయసహకారాలు అందలేదన్నారు. 
 
ఆర్తి భర్త మనోజ్ శర్మ మాట్లాడుతూ.. పిల్లల చదువుల కోసం కిడ్నీని అమ్మాలని ఆమె నిర్ణయించుకుందని చెప్పారు. తాను టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని, నెలకు రూ.4-5 వేలు వస్తాయని పేర్కొన్నాడు. తమకు ప్రభుత్వం సాయం చేస్తే చిన్న వ్యాపారం ప్రారంభించి పిల్లలను చదివించుకుంటామని విజ్ఞప్తి చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments