Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖానికి ఉన్న దుపట్టా జారిపోయిందని.. కుమార్తెను కొట్టిచంపిన తండ్రి

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (12:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఆలయ ప్రవేశం చేయబోయిన ఓ దళిత వృద్ధుడిని సజీవ దహనం చేసిన దారుణం మరచిపోకముందే.. ఓ తండ్రి తన నాలుగేళ్ళ కుమార్తెను కర్కశంగా కొట్టిచంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ చిన్నారి చేసిన నేరం ఏంటో తెలుసా..? ఆమె ముఖానికి ధరించిన దపట్టా భోజనం చేసే సమయంలో కిందికి జారిపోవడమే. 
 
బరేలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాఫర్ హుస్సేన్ అనే వ్యక్తికి ఫర్హీన్ అనే నాలుగేళ్ళ కుమార్తె ఉంది. ఈ చిన్నారి అన్నం తింటున్న సమయంలో ముఖానికి ఉన్న ముసుగు (దుపట్టా) జారిపోయింది. ఇది ముస్లిం మత విశ్వాసాలకు వ్యతిరేకమని, ఘోర తప్పిదమని భావించిన జాఫర్, కోపంతో తన కూతురిని దారుణంగా కొట్టి, పాప తలను నేలకేసి బాదాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
కూతురి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన భార్యను సైతం జాఫర్ వదిలిపెట్టలేదు. జరిగిన విషయం బయటకు రాకుండా చూసేందుకు ఆ పాపను ఇంట్లోనే ఖననం చేయాలని ప్రయత్నించాడు. భర్త చేసిన దారుణంపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్న బరేలి ఎస్పీ బీకే శ్రీవాస్తవ వెల్లడించారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments