Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో బీజేపీదే హవా: రేప్ మంత్రికి భారీ ఆధిక్యం.. ములాయం చిన్నకోడలు ఓటమి?

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లోనే కాకుండా 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ యూపీలోనూ బీజేపీ హవానే కొనసాగుతోందని జోస్యం తెల

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (09:14 IST)
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లోనే కాకుండా 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ యూపీలోనూ బీజేపీ హవానే కొనసాగుతోందని జోస్యం తెలిపారు. ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సరిగా అంచనా వేయలేక పోయాయని... తాము 300 స్థానాల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. 
 
403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో అధికారం చేపట్టాలంటే.. ఏ పార్టీకైనా 202 స్థానాలు అవసరం.. అలాంటిది యూపీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని.. ఎగ్జిట్ పోల్స్ అవతరిస్తుందని తేల్చాయి. ఇదిలా ఉంటే.. యూపీ రాజధాని లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ ఓటమి దిశగా అడుగులేస్తున్నారు. 
 
అపర్ణా యాదవ్‌పై బీజేపీకి చెందిన రీటా బహుగుణా జోషి ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలోని సభ్యుడు ప్రజాపతి భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. అలహాబాద్‌లో సిద్ధార్ధనాథ్ సింగ్ ముందంజలో ఉండగా, పంజాబ్, అమృతసర్‌లో సిద్దూ ఆధిక్యంలో ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments