Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుడతడుకి సిగరెట్ తాగడం నేర్పించిన ప్రభుత్వ వైద్యుడు... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (09:01 IST)
కొందరు విద్యావంతులు కొన్ని సమయాల్లో విచక్షణ మరిచిపోయి తాము ఏం చేస్తున్నామో వారికే తెలియదు. అలాంటి సమయాల్లో వారు చేసే పనులు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటాయి. తాజాగా ఓ ప్రభుత్వ వైద్యుడు చేసిన పనిపై ప్రభుత్వం కన్నెర్రజేసింది. దీంతో ఆ వైద్యుడుపై సస్పెండ్ వేటు వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాలౌన్ జిల్లా కుఠౌంద్ ప్రాథమిక వైద్య కేంద్రంలో పని చేసే వైద్యుడు ఒకటి ఓ బాలుడుకు సిగరెట్ తాగడం నేర్పించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అలాగే, ఆయనపై బదిలీ వేటు కూడా వేసింది. 
 
అదే పీహెచ్‍‌సీలో పని చేసే నర్సు కుమారుడైన ఓ బాలుడు జలుబుకు చికిత్స కోసం వైద్యుు వద్దకు రాగా, ఆయన సిగరెట్ తాగడం నేర్పించాడు. పిల్లాడి నోట్లో సిగరెట్ పెట్టి స్వయంగా తానే వెలిగించడమే కాకుండా, పీల్చు.. పీల్చు అంటూ ప్రోత్సహించాడు. ఈ విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో ఆఖరులో బాస్.. ఈ రోజుకు ఈ శిక్షణ చాలు.. రేపు రా.. మళ్లీ నేర్పుతా అంటున్న డాక్టర్ సురేశ్ చంద్ర గొంతు కూడా అందులో రికార్డు అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments