Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రాహుల్ కంటే చిన్నవాడిని, అఖిలేష్ నాకంటే పెద్దోడు... యూపీ సీఎం యోగి సెటైర్లు

ఇప్పుడు దేశంలో ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారయా అంటే యోగి ఆదిత్యనాథ్ గురించే. ఆయన మంగళవారం నాడు లోక్‌సభలో మాట్లాడారు. గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా వున్న ఆయన తాజాగా యూపీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సభకు ధన్యవాదాల

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (18:15 IST)
ఇప్పుడు దేశంలో ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారయా అంటే యోగి ఆదిత్యనాథ్ గురించే. ఆయన మంగళవారం నాడు లోక్‌సభలో మాట్లాడారు. గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా వున్న ఆయన తాజాగా యూపీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సభకు ధన్యవాదాలు చెపుతూ... తన వయసు గురించి చాలామందికి ఇప్పుడు సందేహాలు కలుగుతున్నాయనీ, వాటిని ఇప్పుడే నివృత్తి చేస్తానన్నారు. 
 
నా వయసు ఎంత అని మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయని అన్నారు. తను రాహుల్ గాంధీ కంటే ఒక ఏడాది చిన్నవాడినని, అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన కంటే చాలా పెద్దవారని ఛలోక్తి విసిరారు. దీనితో సభలో నవ్వులు విరిశాయి.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... యూపీఎ హయాంలో ఉత్తరప్రదేశ్ ఒక్క అడుగు కూడా అభివృద్ధి వైపు సాగలేదన్నారు. అలాగే అఖిలేష్ యాదవ్ సమయంలోనూ పేద రైతులను గాలికొదిరేశారని విమర్శించారు. ఇప్పుడు వారంతా భాజపా వైపు చూశారనీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపు ఆశగా చూస్తున్నారన్నారు. ఇప్పటికే కేంద్రం వేలకోట్లు నిధులను రాష్ట్రానికి అందించిందన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రానికి మరిన్ని నిధులు సమకూరుస్తారనీ, ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందిస్తారని చెప్పారు. 

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments