Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటరాని ప్రేమ : దళితుడిని పెళ్లి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెపై లాయర్ల దాడి

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (13:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొత్త దంపతులపై ఆ రాష్ట్ర న్యాయవాదులు దాడిచేశారు. దళిత యువకుడుని పెళ్లి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెపై లాయర్లు దాడి చేశారు. ఈ మేరకు బాధితులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా ఓ దళిత యువకుడిని వివాహం చేసుకుంది.
 
ప్రేమ వివాహం చేసుకున్న సాక్షి మిశ్రా, ఆమె భర్త అజితేశ్ కుమార్ తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం ఉదయం అలహాబాద్ హైకోర్టులో హాజరయ్యారు. కోర్టు విచారణ పూర్తయి, బయటకు వస్తున్న ఈ జంటపై కొందరు న్యాయవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే ఆ దాడుల నుంచి ఈ దంపతులను అక్కడే ఉన్న మరికొందరు లాయర్లు కాపాడారు. 
 
సాక్షి మిశ్రా, అజితేశ్ కుమార్‌కు రక్షణ కల్పించాలని జస్టిస్ సిద్దార్థ వర్మ ఆదేశించిన కొద్దిసేపట్లోనే ఈ దాడి జరుగడం గమనార్హం. జరిగిన ఘటనపై సాక్షి దంపతులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, వాళ్లపై దాడి జరిగినట్టు మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని కంటోన్మెంట్ పోలీసు అధికారి ఏ కే గౌతమ్ తెలిపారు.
 
ఈ వ్యవహారంలో కిడ్నాప్‌కి గురైన వాళ్లు సాక్షి, అజితేశ్ అన్న వదంతులు వ్యాపించాయని చెప్పారు. పెళ్లి చేసుకున్న అనంతరం తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ సాక్షి మిశ్రా ఇటీవల ఓ వీడియోలో పేర్కొన్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments