రేప్ చేసినపుడు చూద్ధాం... ఉన్నావ్‌ పోలీసుల నిర్లక్ష్యం

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (12:07 IST)
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి పట్ల స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించినట్టు తెలుస్తోంది. తనపై అత్యాచారం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ పోలీసుకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఖాకీలు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. 
 
ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలిని తగలబెట్టి 36 గంటలు గడిచాయో.. లేదో.. మరో బాధిత మహిళ పట్ల పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తనపై అత్యాచారయత్నం చేయబోయారంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఆమెను ఎగతాళి చేశారు. 
 
'ఇప్పుడు రేప్‌ జరగలేదుగా? అత్యాచారం జరిగిన తర్వాత రా.. చూద్దాం' అంటూ పంపేశారు. ఐదు నెలల క్రితం మందులు కొనడానికి వెళ్తుండగా ఐదుగురు అత్యాచారం చేయబోయారని, వారిలో ముగ్గురిని గుర్తించానంటూ పేర్లు బయటపెట్టింది. 
 
'ఆ ఘటన అనంతరం 1090కి ఫోన్‌ చేశా. వాళ్లు 100కి కాల్‌ చేయమన్నారు. ఆ నంబరుకి ఫోన్‌ చేశా. ఉన్నావ్‌లో పోలీసుల దృష్టికి తీసుకెళ్లా. ఘటన ఎక్కడ జరిగిందో అక్కడే ఫిర్యాదు చేయమని చెప్పారు. మూడు నెలలుగా అక్కడికి, ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాను' అని బాధితురాలు పేర్కొంది. 
 
తనను చంపుతామని నిందితులు బెదిరించారని తెలిపింది. ఉన్నావ్‌ జిల్లా సిందుపూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామంలో ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలిని తగులబెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments