కరోనా బారిన పడిన నితిన్ గడ్కరీ.. స్వల్ప లక్షణాలతో..?

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (13:06 IST)
ఇటీవలి కాలంలో కరోనా బారిన పడుతున్న మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల జాబితా పెరిగిపోతోంది. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కరోనా బారిన పడిన నేపథ్యంలో తాజాగా కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి.
 
"నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలున్నాయి. అన్ని ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ నాకు నేనుగా ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. హోం క్వారంటైన్‌లో ఉన్నాను. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారు ఐసోలేట్ అయ్యి టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.." అంటూ గడ్కరీ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments