Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (15:43 IST)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విశ్వాంతి గదికి తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. ఆయన గురువారం నార్త్ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో రూ.1206 కోట్ల వ్యయంతో చేపట్టే జాతీయ రహదారుల నిర్మాణ శంకుస్థాపనల కోసం వెళ్లారు. అక్కడ వేదికపై ఉండగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఆ వెంటనే అధికారులు కార్యక్రమాన్ని నిలిపివేసి పక్కనే ఉన్న గ్రీన్ రూమ్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి సెలైన్ ఎక్కించారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినట్టు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత సిలిగురి నుంచి ఒక సీనియర్ వైద్యుడుని పిలిపించి వైద్యం చేశారు. 
 
ఆ తర్వాత డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా మంత్రి గడ్కరీని తన నివాసానికి తీసుకెళ్లారు. పిమ్మట మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేలా ఏర్పాట్లుచేశారు. ప్రత్యేక వైద్య బృందం ఎంపీ నివాసానికి చేరుకుని వైద్యం చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments