Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియాపై ఆఫ్ ద రికార్డుగా మాట్లాడా.. నొప్పించివుంటే సారీ : గిరిరాజ్ సింగ్

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (17:04 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సారీ చెప్పారు. సోనియా లేదా చాలా మంది గురించి ఆఫ్ ద రికార్డు మాట్లాడుతుంటామని, అలానే సోనియా గురించి మాట్లాడినట్టు చెప్పారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలు సోనియాను బాధించివుంటే క్షమించాలని కోరారు. 
 
రాజీవ్ గాంధీ తెల్లచర్మం మహిళ (సోనియా)ను కాకుండా ఓ నైజీరియన్ మహిళను పెళ్లి చేసుకునుంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. సోనియా తెల్లరంగు చర్మం మహిళ కాబట్టే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించిందంటూ బుధవారం ఓ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.ఈ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.
 
దీంతో మంత్రి గిరిరాజ్ సింగ్ వివరణ ఇచ్చారు. అటువంటి ప్రకటన చేసినందుకు క్షమాపణ చెబుతున్నానన్నారు. తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, 'చాలా విషయాలు అనేక విధాలుగా ఆఫ్ ద రికార్డు అంటుంటారు. కానీ, నా వ్యాఖ్యలు రాహుల్‌ను లేదా సోనియాను బాధపెట్టివుంటే చింతిస్తున్నా' అని వివరణ ఇచ్చారు. 
 
కాగా గిరిరాజ్ చేసిన ప్రకటనపై అంతకుముందు బీజేపీ స్పందించింది. దాంతో తమకెలాంటి సంబంధంలేదని చెప్పింది. అలాంటి ప్రకటన చేసినప్పుడు తమను తామే అణుచుకుంటారని, పరిపాలన, అభివృద్ధిపైనే ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని బీజేపీ హితవు పలికింది. ఆ కొద్దిసేపటికే గిరిరాజ్ సింగ్ తన వివరణ ఇవ్వడం గమనార్హం. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments