Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఎలా ఇవ్వాలో అర్థంకావట్లేదు : అరుణ్ జైట్లీ

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ప్రత్యేక హోదా స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తెచ్చిన ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఎలా ఇవ్వాలో అర్థం కావట్ల

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (17:13 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ప్రత్యేక హోదా స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తెచ్చిన ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 2018-19 వార్షిక బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంగళవారం పార్లమెంట్ ఉభయసభలూ స్తంభించిపోయాయి. 
 
దీనిపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో స్పందిస్తూ, ఏపీ విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికే ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.3,990 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో రావాల్సిన నిధులను ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఎలా ఇవ్వాలన్నదే ప్రధాన అంశమని, ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ (ఈఏపీ)ల ద్వారా ప్రత్యేక హోదా లోటును భర్తీ చేస్తామని అన్నారు. 
 
ఈఏపీలపై జనవరి 3వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు ఒక లేఖ రాశారని, ఈఏపీలకు నాబార్డు ద్వారా నిధులు కేటాయించాలని బాబు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే, ఈఏపీలకు నాబార్డు ద్వారా నిధులు ఇవ్వాలంటే సమస్య ఎదురవుతోందని, ఆవిధంగా నిధులిస్తే రాష్ట్ర రుణ సామర్థ్యం తగ్గుతుందని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments