Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా వల్లకాదు చంపమంటున్న డేరా బాబా... నేపాల్‌కు పారిపోయిన హనీ?

డేరా బాబాకు జైలు శిక్ష పడిన తర్వాత అతడిని తప్పించేందుకు ఆయన దత్త పుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ యత్నం చేసినట్లు అభియోగాలు మోపుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆమె తెలుసుకున్నదో ఏమోగానీ కంటికి కనిపించకుండా పారిపోయింది. ఆమె నేపాల్ దేశానికి చెక్కే

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (21:22 IST)
డేరా బాబాకు జైలు శిక్ష పడిన తర్వాత అతడిని తప్పించేందుకు ఆయన దత్త పుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ యత్నం చేసినట్లు అభియోగాలు మోపుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆమె తెలుసుకున్నదో ఏమోగానీ కంటికి కనిపించకుండా పారిపోయింది. ఆమె నేపాల్ దేశానికి చెక్కేసి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హనీ పరారీలో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
మరోవైపు తనకు బతకాలనే ఆశ ఏమాత్రం లేదనీ, అందువల్ల తనను ఉరితీయాలంటూ డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ జైలు గదిలో బిగ్గరగా అరుస్తూ గగ్గోలు పెడుతున్నాడట. తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా బాబాకు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయనను రోహ్‌తక్‌లోని సునారియా జైలులో బంధించాడు. ఇదే జైలులో శిక్ష అనుభవిస్తూ వచ్చిన ఓ ఖైదీ బెయిల్‌పై విడుదలయ్యాడు. 
 
అతను జైలు బయట మీడియాతో మాట్లాడుతూ... జైలుకి వచ్చిన రోజు రాత్రంతా నిద్ర‌పోకుండా తాను చేసిన త‌ప్పేంట‌ని, ఈ శిక్ష ఎందుకు విధించారు దేవుడా? అని గుర్మీత్ సింగ్‌ బాధ‌ప‌డిపోయాడ‌ని చెప్పాడు. అంతేగాక‌, త‌న‌ను ఉరితీయాల‌ని, త‌న‌కు బ‌త‌కాల‌ని లేద‌ని గుర్మీత్ బాబా వేడుకున్నాడ‌ని తెలిపాడు.
 
అలాగే, గుర్మీత్ బాబాని జైల్లో మిగతా ఖైదీల్లాగే చూస్తున్నార‌ని, ఆయ‌న‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఏమీ లేద‌ని ఆ ఖైదీ చెప్పాడు. కాగా, ఇద్ద‌రు సాద్వీల‌పై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ బాబాకు హ‌ర్యానాలోని పంచ‌కుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, 15 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించిన విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments