Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుణ్య కోటాలో ఉద్యోగం కోసం... తండ్రిని చంపిన కొడుకు

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (17:36 IST)
కారుణ్య కోటలో ఉద్యోగం కోసం ఓ కన్నబిడ్డ తండ్రిని చంపేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. కారుణ్య‌ కోటాలో ఉద్యోగం పొందేందుకు ఓ కొడుకు త‌ల‌పెట్ట‌రాని చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా రామ్‌ (55) అనే వ్య‌క్తి రామ్‌గ‌ర్ జిల్లాలోని బ‌ర్కక‌నాలో గ‌ల‌ సెంట్ర‌ల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌(సీసీఎల్‌)లో సెక్యురిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. కాగా ఇత‌ను గ‌డిచిన‌ గురువారం అనుమానాస్ప‌ద‌రీతిలో మృతిచెందిప‌డి ఉన్నాడు.
 
అయితే, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి వచ్చి సమాచారం సేకరించగా, గొంతు కోయ‌డంతో చ‌నిపోయిన‌ట్లుగా నిర్ధారించారు. ఈ విచార‌ణ‌లో కృష్ణారామ్ పెద్ద కొడుకు రామ్(35) హ‌త్య‌చేసిన‌ట్లుగా క‌నుగొన్నారు. చిన్న క‌త్తితో క్వార్ట‌ర్స్‌లోనే తండ్రి గొంతుకోసి చంపిన‌ట్లుగా తెలిపారు.
 
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు హ‌త్య‌కు ఉప‌యోగించిన క‌త్తి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగి అయిన రామ్‌ కారుణ్య కోటాలో ఉద్యోగం పొందేందుకు తండ్రిని హ‌త‌మార్చిన‌ట్లుగా పోలీసులు వెల్ల‌డించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments