Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వం మంటగలిసిపోతోంది.. మేనకోడలుపై అత్యాచారయత్నం...

మానవత్వం మంటగలిసిపోతోంది. మానవీయ విలువలు కాస్త గంగలో కలిసిపోతున్నాయి. తాజాగా మేనకోడలిపై మేనమామ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నేపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌ దేశానికి చెంద

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (11:09 IST)
మానవత్వం మంటగలిసిపోతోంది. మానవీయ విలువలు కాస్త గంగలో కలిసిపోతున్నాయి. తాజాగా మేనకోడలిపై మేనమామ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నేపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌ దేశానికి చెందిన తులసీ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. పదేళ్లుగా సైదాబాద్‌ సింగరేణి గుడిసెలలో నివసించేవాడు. 
 
కొద్దినెలల క్రితం కుటుంబంతో చర్లపల్లికి మకాం మార్చాడు. సింగరేణి గుడిసెలలో నివసిస్తున్న సమయంలో వరుసకు అక్క, బావ అయ్యే బంధువుల కుటుంబం అతడి ఇంటి సమీపంలో ఉండేవారు. ఈనెల 17వ తేదీన తులసీ వారింటికెళ్లాడు. బయట ఆడుకుంటున్న వారి కుమార్తె(11)ను ట్యాంక్‌బండ్‌ చూపిస్తానని ఆటో ఎక్కించుకున్నాడు. చర్లపల్లిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. 
 
అనంతరం బాలికను ఇంటివద్ద దింపేశాడు. అయితే బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో సైదాబాద్ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడు పరారీలో ఉన్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments