Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాకు ఉద్ధవ్‌ ఠాక్రే వార్నింగ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (23:23 IST)
తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి, నటి కంగనా రనౌత్‌కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా వ్యవహారంపై సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటుగా స్పందించారు.

తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం కరోనా కట్టడిపైనే ఉందని, రాజకీయాలపై ఇప్పుడేమీ మాట్లాడనని పేర్కొన్నారు. మహారాష్ట్రను అపఖ్యాతి పాలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని, సరైన సమయంలో దీనిపై స్పందిస్తానని అన్నారు. మహారాష్ట్రను బద్నాం చేయడానికి కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

వీటన్నింటిపై సరైన సమయంలో సిఎం ప్రొటోకాల్‌ పక్కన పెట్టి మరీ స్పందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గిందని, ఈ నెల 15 నుంచి 'నా కుటుంబం - నా బాధ్యత' కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.

ఇందులో భాగంగా వైద్యులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తారని తెలిపారు. ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments