Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో అభినవ దుశ్శాసనులకు అరదండాలు!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (16:52 IST)
ఓ వివాహితను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన అభినవ దుశ్శాసనులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి వారితో అరదండాలు వేయించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... మహారాష్ట్ర భివాండి జిల్లాకు గుల్బర్గా ప్రాంతం నుంచి కూలి పనుల నిమిత్తం కొన్ని కుటుంబాలు వలస రావడం తరచూ జరుగుతుంటుంది. వీరంతా భవన నిర్మాణ కూలీలుగా పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. 
 
నర్బోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్ ప్రాంతంలో నివాసముండే గణ్ పత్ రాథోడ్, శంకర్ జాదవ్ అనే యువకులు, కూలి పనులు చేసుకుని ఇంటికి వెళుతున్న పాతికేళ్ల వివాహితను అటకాయించారు. తమతో వస్తే 2000 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. ఆమె నిరాకరించడంతో ఆమె చీర లాగేందుకు ప్రయత్నించారు. 
 
ఇంతలో వారిని అడ్డుకునేందుకు ఆమె వదిన రావడంతో ఆమెపైనా దాడి చేశారు. ఎలాగో, వారి బారి నుంచి తప్పించుకున్న వదిన, మరదలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ యువకులపై సెక్షన్ 354, 354(ఎ), 354(బి) కింద కేసులు నమోదు చేశారు. వీరిద్దరిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నర్పోలి స్టేషన్ ఎస్ఐ యోగితా కోకటే తెలిపారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments