బందిపొరాలో ఎన్‌కౌంటర్ - ఇద్దరు ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (08:10 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. 
 
గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. 
 
అయితే, ఈ ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియరాలేదు. దాగివున్న ముష్కరుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నాయి. 
 
మరో ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్టును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్‌ జిల్లాలోని వెరినాగ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ముష్కరుల కాల్పుల్లో నలుగురు పోలీసులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments