Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రాన్ని తాపించి... మలంద్వారంలో పచ్చిమిరపకాయలు చొప్పించారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (12:43 IST)
ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీ వ్యక్తిపై బీజేపీ నేత ఒకరు మూత్రం పోసిన ఘటన మరిచిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ రాష్ట్రంలోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలురిపై కొందరు వ్యక్తులు నీచాతినీచంగా ప్రవర్తించారు. 
 
బాటిళ్లలో మూత్రాన్ని నింపి వారిచేత బలవంతంగా తాగించారు. అంతటితో ఆగకుండా మలద్వారంలో పచ్చిమిరపకాయలు చొప్పించారు. ఈ ఘటన ఈ నెల 4న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో నిందితులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే సిద్దార్థ నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన 10, 15 ఏళ్ల బాలురిద్దరు డబ్బు దొంగతనం చేశారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు వారిని పట్టుకున్నారు. వాళ్లను ఓ చోట బంధించి వికృత చేష్టలకు పాల్పడ్డారు. వారిని దుర్భాషలాడుతూ శారీరకంగా హింసించారు. వాళ్లతో బలవంతంగా పచ్చిమిరపకాయాలు తినిపించారు. 
 
మంటతో వాళ్లు ఏడుస్తుంటే.. తాగేందుకు బాటిళ్లలో మూత్రం నింపి ఇచ్చారు. వాళ్లు నిరాకరిస్తే.. చంపేస్తామని బెదిరించి బలవంతంగా తాగించారు. దుస్తులు విప్పించేసి.. వాళ్ల మలద్వారంలో మిరపకాయలు కుక్కేశారు. బాధతో వాళ్లు ఏడుస్తుంటే రాక్షసానందం పొందారు. ఈ ఘటనను అక్కడికి సమీపంలో ఉన్న ఓ చికెన్‌ దుకాణంలో ఉన్న వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో తాజాగా చర్యలకు ఉపక్రమించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించామని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments