Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యానికి మనీ ఇవ్వలేదని భార్యలను చంపేశారు.. ఎవరో తెలుసా?

ఇద్దరు స్నేహితులు తమతమ భార్యలను చంపేశారు. అందులో ఒక మృతదేహాన్ని బావిలో పడేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టి ఊరివిడిచి పారిపోయారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జర

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (11:01 IST)
ఇద్దరు స్నేహితులు తమతమ భార్యలను చంపేశారు. అందులో ఒక మృతదేహాన్ని బావిలో పడేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టి ఊరివిడిచి పారిపోయారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... పాలీగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిక్రియా హుస్హరీ ప్రాంతంలో నారద్ మాంఝీ, అఖిలేష్ మాంఝీ అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉన్నారు. వీరిద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. వీరికి మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో మద్యానికి బానిసలైన వీరిద్దరూ డబ్బుకోసం తమ భార్యలను వేధించేవారు. ఈ క్రమంలో మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యలను ఒత్తిడి చేయగా, వారు తమ వద్ద లేదని చెప్పారు. 
 
అంతే.. ఆగ్రహించిన వీరిద్దరూ ఇళ్లకు వచ్చి తమ భార్యల గొంతు నొక్కి హత్య చేశారు. ఒక మృతదేహాన్ని బావిలో పారేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టి ఆ ఇద్దరు స్నేహితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments