Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ సైనికులు కాల్పులు.. గాయపడిన ఇద్దరు జవాన్లు

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (10:26 IST)
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికులు కాల్పులు జరిపారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్- బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. మంగళవారం ఉదయం 8.15 గంటలకు అర్నియా సెక్టార్‌లోని విక్రమ్ పోస్ట్‌పై పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరిపారు.
 
ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు బుల్లెట్లు తగిలిందని, వారికి వెంటనే వైద్యసహాయం అందించామని బీఎస్ఎఫ్ ప్రకటన తెలిపింది. కాల్పుల ఘటనను పాక్ రేంజర్లతో ప్రస్తావించి వారిపై ఫిర్యాదు చేస్తామని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. 
 
కాల్పులు ప్రారంభం కాగానే సరిహద్దు పోస్ట్ సమీపంలో విద్యుత్ పనులు చేస్తున్న ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లపై పాక్ బలగాలు కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. 
 
ఫిబ్రవరి 25, 2021న, భారతదేశం- పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి కాల్పుల విరమణపై అన్ని ఒప్పందాలను ఖచ్చితంగా పాటించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments