Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద పుష్కర్ మృతి కేసులో ట్విస్ట్.. విదేశీయులతో లింకు?

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (10:38 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. గుర్తు తెలియని ముగ్గురు విదేశీయులకు ఈ హత్యతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముగ్గరూ నకిలీ పాస్‌పోర్టులతో సునంద పుష్కర్ హత్య జరిగిన జనవరి 17వ తేదీన ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. దీని పైన మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ముగ్గురు పోలీసు అధికారులను దుబాయ్‌ పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
సునంద మరణించిన లీలా ప్యాలెస్ హోటల్‌లో సదరు విదేశీయులు ఈ యేడాది జనవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దాకా బస చేసినట్లు కనుగొన్నారు. వీరంతా ఎలాంటి వీసా అనుమతులు లేకుండానే దేశంలోకి ప్రవేశించిన సదరు వ్యక్తులు పాకిస్థాన్, దుబాయ్ దేశాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నకిలీ పాస్ పోర్టులు సమర్పించిన సదరు వ్యక్తులు దాదాపు ఐదు రోజుల పాటు ఆ హోటల్‌లో బస చేశారని పోలీసులు నిర్ధారించారు. ఇదిలావుంటే, విష ప్రయోగం కారణంగానే సునంద మృతి చెందిందని నిర్ధారించిన ఎయిమ్స్ వైద్యులు, ఏ విషాన్ని తీసుకుందన్నది మాత్రం తేల్చలేకపోయారు. దీంతో ఇతర పరీక్షల కోసం ఆమె శరీర భాగాలను పోలీసులు విదేశాలకు పంపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments