Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతుల్లాగా మెదడును వాడితే ఇంతే.. దొంగ బాబాలు పుడతారు: ట్వింకిల్ ఖన్నా

కోతుల్లాగా మన మెదడును వాడితే ఇలాగే ఉంటుందని.. బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా అన్నారు. డేరా సచ్ఛా సౌదా చీఫ్, బాబా గుర్మీత్‌ రాంరహీం సింగ్‌ దోషిగా తేలడంపై ఆమె స్పందిస్తూ.. మెదడును కోతిలా వాడితే ఇలా

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (17:46 IST)
కోతుల్లాగా మన మెదడును వాడితే ఇలాగే ఉంటుందని.. బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా అన్నారు. డేరా సచ్ఛా సౌదా చీఫ్, బాబా గుర్మీత్‌ రాంరహీం సింగ్‌ దోషిగా తేలడంపై ఆమె స్పందిస్తూ.. మెదడును కోతిలా వాడితే ఇలాగే ఉంటుందని, బాబాలు ఇలాగే మోసాలకు పాల్పడతారన్నారు. ఎంతో తెలివైన వాళ్లు సైతం తమను రక్షిస్తాడంటూ నమ్మి గుర్మిత్ వద్దకు వెళ్లి ఉంటారన్నారు. చెడు పనులు చేసే వారిని, దొంగ స్వామీజీలను కొంతకాలానికే గుర్తుపట్టే అవకాశం ఉందని పిలుపునిచ్చారు.
 
ఇకనైనా మనలో మార్పు వస్తే మంచిదన్నారు. సూర్యుడి వైపు పొద్దుతిరుగుడు పువ్వు ఎలాగైతే మళ్లి ఉంటుందో, అదే తీరుగా జనాలు దొంగ ప్రజల చుట్టూ తిరుగుతుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీబీఐ కోర్టు గుర్మీత్ ను ఇటీవల దోషీగా ప్రకటించిన అనంతరం డేరాలు చెలరేగి చేసిన దాడులలో 36 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని ట్వింకిల్ ఖన్నా అన్నారు.
 
కాగా గుర్మీత్‌పై అత్యాచారం, హత్య కేసులు 2002లో నమోదు అయ్యాయి. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఆగస్టు 25, 2017న తీర్పునిచ్చింది. ఆగస్టు 28న ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments