Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు తుగ్లక్ చర్య .. బాంబు పేల్చిన యశ్వంత్ సిన్హా

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు మాటల తూటాలు పేల్చారు. గత యేడాది నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ఓ తుగ్లక్ చర్యగా ఆయన అభ

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (14:22 IST)
కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు మాటల తూటాలు పేల్చారు. గత యేడాది నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ఓ తుగ్లక్ చర్యగా ఆయన అభివర్ణించారు. 
 
గుజరాత్‌లో జరిగిన 'లోక్‌షాహి బచావో అభియాన్‌' కార్యక్రమంలో సిన్హా మాట్లాడుతూ, 14వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాన్‌ మ‌హ‌మ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ 700 ఏళ్ల క్రితమే నోట్ల రద్దు తీసుకొచ్చారని గుర్తుచేశారు. 'ఎంతో మంది రాజులు తమ సొంత కరెన్సీని తీసుకొచ్చారు. మరికొంతమంది పాత కరెన్సీ పంపిణీ జరుగుతున్నా.. కొత్తవాటిని ప్రవేశపెట్టారు. 
 
కానీ 700 ఏళ్ల క్రితం తుగ్లక్‌ పాత కరెన్సీని రద్దు చేసి తన సొంత కరెన్సీని తీసుకొచ్చారు. అంటే 700 ఏళ్ల క్రితమే నోట్లరద్దు జరిగిందని తెలుస్తోందని' సిన్హా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థికవ్యవస్థకు 3.75 లక్షల కోట్ల నష్టం జరిగిందని మండిపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని, ఈ విషయంలో బీజేపీ పూర్తిగా విఫలమైందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments