Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే.నగర్ బైపోల్ : దినకరన్ ఆస్తులు రూ.77 కోట్లు... మధుసూదనన్ ఆస్తుల విలువ రూ.4 కోట్లు

చెన్నై, ఆర్కే.నగర్ ఉపఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం సాయంత్రంతో నామినేషన్ దాఖలు ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి అధికార అన్నాడీఎంకేతో పాటు డీఎంకే, డీఎండీకే, బీజేపీ, స

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (14:28 IST)
చెన్నై, ఆర్కే.నగర్ ఉపఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం సాయంత్రంతో నామినేషన్ దాఖలు ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి అధికార అన్నాడీఎంకేతో పాటు డీఎంకే, డీఎండీకే, బీజేపీ, సీపీఎంలతో పాటు చిన్నాచితక పార్టీల అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు పోటీపడుతున్నారు. 
 
అయితే, ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో వారి ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇందులో అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున పోటీ చేస్తున్న శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ మొత్తం ఆస్తుల విలువ రూ.77.96 కోట్లుగా ప్రకటించారు. 
 
అలాగే, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గం తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఇ.మధుసూదనన్ ఆస్తుల విలువ రూ.4.97 కోట్లుగా ఉంది. ఇకపోతే ప్రధాన విపక్షమైన డీఎంకే తరపున మరుద గణేష్ పోటీ చేస్తుండగా, ఆయన ఆస్తుల విలువ కేవలం 9.88 లక్షలు మాత్రమే. 
 
సినీ నటుడు విజయకాంత్ సాథ్యంలోని డీఎండీకే తరపున మదివాణన్ పోటీ చేస్తుండగా ఆయన ఆస్తుల విలువ రూ.40.69 లక్షలుగా ఉంది. సీపీఎం అభ్యర్థి లోగనాథన్ ఆస్తుల విలువ రూ.6.05 లక్షలుగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగై అమరన్, జయలలిత మేనకోడల జయదీప ఆస్తుల వివరాలను మాత్రం బహిర్గతం కాలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments