Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటి నొప్పులతో అలా నడుం వాల్చితే.. భర్త తలాక్ చెప్పేశాడు..

ఒంటి నొప్పులతో కొద్దిసేపు అలా నడుం వాల్చిన పాపానికి ఓ భర్త తలాక్ చెప్పి ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం బిల్లును ఆమోదించినా.. తలాక్ చెప్పి భార్యను దూరం చేసుకునే భర్తలు వెలుగులోక

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (18:48 IST)
ఒంటి నొప్పులతో కొద్దిసేపు అలా నడుం వాల్చిన పాపానికి ఓ భర్త తలాక్ చెప్పి ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం బిల్లును ఆమోదించినా.. తలాక్ చెప్పి భార్యను దూరం చేసుకునే భర్తలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్, రాంపూర్‌లో మద్యం తాగి భర్త చేజేసుకోవడంతో.. ఒంటి నొప్పులతో ఉదయం ఎక్కువగా నిద్రపోయిన భార్యకు భర్త తలాక్ చెప్పాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రాంపూర్‌లోని అజీంనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ బుధవారం ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేవడంతో భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటి నుంచి గెంటేసి.. తలాక్ చెప్పానని ఇక ఇంటి గడప తొక్కవద్దన్నాడు. 
 
ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త రాత్రి మద్యం తాగి కొట్టడంతోనే... ఒంటి నొప్పులతో బాధపడుతూ గంట సేపు ఎక్కువగా నిద్రపోయానని బాధితురాలు వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన త‌రువాత సైతం 100 ట్రిపుల్ తలాక్ కేసులు బయటపడ్డాయని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ లోక్‌స‌భ‌లో వెల్లడించారు. గురువారం ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగాఆయ‌న మాట్లాడుతూ... ట్రిపుల్ త‌లాక్ అంశంపై పార్ల‌మెంటు చూస్తూ ఊరుకోవాలా? అని ప్ర‌శ్నించారు. ఓటు బ్యాంకు రూపంలో ఈ బిల్లును చూడ‌వ‌ద్దని కేంద్ర మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఇది ముస్లిం మ‌హిళ‌ల గౌర‌వానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌ను పాకిస్థాన్‌లోనూ నిషేధించారని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments