Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ గోరఖ్‌పూర్‌లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఢీ: 9 మంది మృతి

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (09:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో గత అర్థరాత్రి రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బోగిల మధ్య మరింత ప్రయాణికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. 
 
క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైలు సిగ్నాల్ దాటి వెళ్లి అదే ట్రాక్పై వస్తున్న బరౌనీ ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టిందని వారు తెలిపారు. దీంతో బరౌనీ ఎక్స్ప్రెస్కు చెందిన 5 జనరల్ బోగీలు పట్టాలు తప్పగా... క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైలులోని పలు కోచ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. కాగా క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైల్ డ్రైవర్లు ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా గోరఖ్పూర్ మార్గంలో పలురైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను మాత్రం మరో మార్గంలో మళ్లిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments